జియో ఏఐ సేవలు: క్యాబ్ బుక్ చేస్తుంది.. స్కోర్ చెబుతుంది.. డాక్టర్ అపాయింట్మెంట్ గుర్తుచేస్తుంది!
- జియో నుంచి కొత్త ఏఐ సేవలు
- ‘హే జియో’ అనే పిలుపుతో కాల్ ఏజెంట్ యాక్టివేట్
- కాల్ ట్రాన్స్క్రిప్షన్, సమ్మరీ
- క్యాబ్, ఫుడ్ బుకింగ్ సదుపాయం
- మైజియో యాప్‌కు ఏఐ రూపం
- రోజువారీ పనుల్లో డిజిటల్ సాయంగా టెలిఫ్రేమ్
మొబైల్ నెట్వర్క్ అంటే కాల్స్, ఇంటర్నెట్ అనుకునే రోజులు త్వరలో మారిపోవచ్చు. ఫోన్లో మాట్లాడుతుండగానే ఓ డిజిటల్ సహాయకుడు మీ కాల్లోకి వచ్చి నోట్స్ రాసిపెడితే? క్యాబ్ బుక్ చేయమంటే బుక్ చేస్తే? ఇంట్లో ఓ చిన్న పరికరం మీ డాక్టర్ అపాయింట్మెంట్ను గుర్తు చేస్తూ, క్రికెట్ స్కోర్లు చూపిస్తే? ఇవన్నీ భవిష్యత్ కలలు కావని, త్వరలో నిజం కాబోతున్నాయని జియో చెబుతోంది. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆకాశ్ అంబానీ ప్రకటించిన కొత్త సేవలు అందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి.
జియో ఇక కేవలం టెలికాం సంస్థగానే కాకుండా కృత్రిమ మేధస్సును నేరుగా వినియోగదారుల చేతుల్లోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాల్స్, యాప్‌లు, ఇంటి అవసరాల కోసం కొత్త ఏఐ సేవలను ప్రకటించింది. అందులో ఎక్కువ ఆసక్తి రేపింది జియో కాల్ ఏజెంట్. ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ‘హే జియో’ అని పిలిస్తే చాలు. యూజర్ అనుమతి తీసుకుని ఏఐ సహాయకుడు కాల్లోకి ప్రవేశిస్తాడు. సంభాషణను వింటాడు. ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటాడు.
ఒకేసారి పలువురు పాల్గొనే కాన్ఫరెన్స్ కాల్లో ఎవరు ఏం మాట్లాడారో గుర్తించి మొత్తం సంభాషణను టెక్స్ట్ రూపంలో అందించగలడు. కాల్ ముగిసిన తర్వాత ముఖ్యాంశాలను క్లుప్తంగా సమ్మరీ చేసి చూపిస్తాడు. అంతటితో ఆగిపోదు. క్యాబ్ బుక్ చేయడం, ఆహారం ఆర్డర్ చేయడం, రెస్టారెంట్లో టేబుల్ రిజర్వ్ చేయడం వంటి పనులను కూడా యూజర్ తరఫున పూర్తి చేయగలడని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి జియో వినియోగదారులకు ఈ సేవ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుతం రీఛార్జ్‌లు, డేటా వినియోగం చూసేందుకు ఉపయోగిస్తున్న మైజియో యాప్ కూడా పూర్తిగా మారబోతోంది. భవిష్యత్‌లో ఇది కేవలం సర్వీస్ యాప్‌గా కాకుండా వ్యక్తిగత డిజిటల్ సహాయకుడిగా పనిచేయనుంది. ఉదాహరణకు.. ఇంటర్నెట్ కనెక్షన్‌ను మరో ఇంటికి మార్చాలనుకుంటే యాప్‌లో మెనూలు వెతకాల్సిన అవసరం ఉండదు. ఏఐకి చెబితే అవసరమైన ప్రక్రియను అదే పూర్తి చేస్తుంది. విదేశాలకు వెళ్లే ముందు సరిపోయే రోమింగ్ ప్లాన్‌ను కూడా సూచిస్తుంది. వినియోగదారుడి అవసరాలను అర్థం చేసుకుని సేవలు అందించడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది.
ఏజీఎం ప్రకటనల్లో ఆకర్షించిన మరో అంశం జియో టెలిఫ్రేమ్. ఇంట్లో ఉండే ఈ పరికరం కుటుంబానికి డిజిటల్ సహాయకుడిలా పనిచేస్తుంది. రోజువారీ కార్యక్రమాలను గుర్తు చేస్తుంది. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే హెచ్చరిస్తుంది. బయట వర్షం పడే అవకాశం ఉంటే గొడుగు తీసుకెళ్లమని సూచిస్తుంది. ఇంట్లోనే ఉండి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. వినోదం విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే జియోహాట్‌స్టార్‌ను ఓపెన్ చేస్తుంది. లైవ్ స్కోర్లు, తాజా అప్డేట్లను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది.
మొత్తంగా చూస్తే మొబైల్ కనెక్టివిటీ నుంచి కృత్రిమ మేధస్సు ఆధారిత సేవల దిశగా జియో వేగంగా అడుగులు వేస్తోందని తాజా ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ సేవలను సాధారణ వినియోగదారులకు మరింత చేరువ చేయడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.